Asia Cup 2023: శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. కష్టాల్లో టీమిండియా ఆరో వికెట్ డౌన్

by Vinod kumar |   ( Updated:2023-09-16 12:30:44.0  )
Asia Cup 2023: శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. కష్టాల్లో టీమిండియా ఆరో వికెట్ డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్, మూడు నెలల బ్రేక్ తర్వాత మళ్లీ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో పాతుకుపోయిన శుబ్‌మన్ గిల్ సెంచరీతో టీమిండియాని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ అందుకున్నాడు. 32వ వన్డే ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌కి ఇది ఐదో సెంచరీ. 266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ రెండో బంతికి డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఆరంగ్రేటం వన్డేలో ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 170 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం 40.3 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 193 రన్స్ చేసింది. అక్షర్ పటేల్ (8), గిల్ (112) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed