Asia Cup 2023: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ!

by Vinod kumar |
Asia Cup 2023: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ!
X

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్‌ 15) జరగాల్సిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అయ్యర్‌ పాల్గొన్నాడు. దీంతో అతను బంగ్లాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం. టీమిండియా ఇదివరకే ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పలువురు సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది కాబట్టి, తుది జట్టులో అయ్యర్‌ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. రాహుల్‌, అయ్యర్‌, ఇషాన్‌ ముగ్గురు రాణించడం శభపరిణామమే అయినప్పటికీ జట్టు కూర్పు ప్రధాన సమస్యగా మారుతుంది.

మున్ముందు భారత మిడిలార్డర్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియాలంటే వేచి చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో మరో సూపర్‌-4 మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. సూపర్‌-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్‌, శ్రీలంకలను ఓడించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు భారత్‌ రేపు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed