Asia Cup 2023 Schedule: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే..?

by Vinod kumar |
Asia Cup 2023 Schedule: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల సమరం ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 17న కోలంబోలో జరిగే ఫైనల్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది. పాకిస్తాన్-టీమిండియా మధ్య జరిగే హైఒల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకూ రౌండ్ 1, సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు రౌండ్ 2 మ్యాచులు జరగనున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో పాక్‌లో నాలుగు మ్యాచులు, శ్రీలంకలో 9 మ్యాచులు జరగనున్నాయి.

ఆసియా కప్ ఈసారి వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఈ ఆసియా కప్‌లో 13 మ్యాచులు జరగనున్నాయి. ముఖ్యంగా భారత ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభకానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed