విద్యాశాఖ వింత పోకడ... నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు

by Aamani |
విద్యాశాఖ వింత పోకడ... నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు
X

దిశ,ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు జరుగుతుండడం చర్చనీయాంశం. డిప్యూటేషన్లపై ఆమనగల్లు, కడ్తాల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. ఆమనగల్లు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆటలలో రాణించాలని పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే, పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతిని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తట్టిఅన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్ళాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అదేవిధంగా కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు 135 మంది ఉండగా,వారికి సాంఘిక శాస్త్రం బోధించే శ్రీదేవి ఉపాధ్యాయురాలిని 20 రోజుల క్రితం సరూర్ నగర్ మండలం కర్మాంఘాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. దీంతో ఆ విద్యార్థులకు సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేక నష్టపోతున్నారు. అదేవిధంగా ఆమనగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు.

Advertisement

Next Story