Asia Cup 2023: ఏ నిర్ణయమైనా జట్టు కోసమే.. టీమిండియా బౌలింగ్ కోచ్

by Vinod kumar |
Asia Cup 2023: ఏ నిర్ణయమైనా జట్టు కోసమే.. టీమిండియా బౌలింగ్ కోచ్
X

కొలంబో : ఆసియా కప్‌లో టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. పేసర్ మహ్మద్ షమీ ఒక్క మ్యాచే ఆడాడు. అది కూడా నేపాల్‌తో మ్యాచ్‌కు బుమ్రా అందుబాటు లేకపోవడంతో షమీకి తుది జట్టులో అవకాశం దక్కింది. దాంతో షమీని కావాలనే బెంచ్‌కే పరిమితం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా తాజాగా దీనిపై టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైనా జట్టు ప్రయోజనం కోసం తీసుకుంటామని చెప్పాడు.

‘షమీ అనుభవజ్ఞుడు. దేశం కోసం అతను చేసిన ప్రదర్శన అపూర్వం. షమీ లాంటి ప్లేయర్‌ను పక్కనపెట్టడం అంత సులభం కాదు. ఆటగాళ్లకు టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం తెలుసు. జట్టు ప్రయోజనం కోసమేనని వారికి కూడా తెలుసు. మేము ఆటగాళ్లతో మాట్లాడాం. వారు మాపై విశ్వాసంగా ఉన్నారు.’ అని తెలిపాడు. బుమ్రా రాకతో టీమ్ ఇండియా పేస్ బలం పెరిగిందని, ఇప్పుడు నలుగురు నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారని చెప్పాడు. ప్రపంచకప్‌కు ముందు ఈ ఆప్షన్ టీమ్ ఇండియా బలాన్ని పెంచుతుందన్నాడు.

అలాగే, హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతూ.. హార్దిక్ విషయంలో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ‘అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేస్తున్నాం. హార్దిక్ ఫిట్‌గా ఉన్నాడని, ఆశించిన మేరకు రాణిస్తాడని నిర్ధారించుకున్నాం. అతను గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలిగితే అతనో భిన్నమైన బౌలర్ అవుతాడు. జట్టు కోణంలో అతను మాకు వికెట్ టేకింగ్ ఆప్షన్.’ అని కోచ్ పరాస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed