- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ashwin : అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలికా.. రిటైర్మెంట్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : క్రియేటివిటీ తగ్గడం వల్లే క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు భారత మాజీ క్రికెటర్ అశ్విన్ అన్నాడు. ఈ మేరకు బుధవారం అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. ‘నాకు విశ్రాంతి అవసరం. అందుకే సిరీస్ మధ్యలో వీడ్కోలు పలికాను. అందుకే సిడ్నీ టెస్ట్ తర్వాత క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. వీడ్కోలు పలికేటప్పటికీ నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాను. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని గౌరవించడం నా బాధ్యత. ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. క్రియేటివిటీ కోల్పోయినందుకే సంతోషంగా కెరీర్ ముగించా. బయట నడుస్తున్న ప్రచారంలో నిజం లేదు. ఫేర్‌వెల్ మ్యాచ్ నాకు ముఖ్యం కాదు. నిజాయితీగా చెప్పాలంటే.. ఫేర్‌వెల్ టెస్ట్ ఆడించాలని మేనేజ్‌మెంట్ భావించి తర్వాత తుది జట్టులో నాకు స్థానం దక్కకపోతే మరింత బాధ పడేవాడిని. అభిమానుల నుంచి రిటైర్మెంట్ ఎప్పుడూ అనే ప్రశ్న రాకముందే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించా..’ అని అశ్విన్ అన్నాడు.