- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India vs Australia : ఆసిస్ బ్యాట్స్ మెన్ లకు అశ్విన్ భయం
దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ తుది సమరానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత జట్టుకు అగ్ని పరీక్ష ఎదురు కానుంది. గురువారం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతోంది. టీంమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్ట్ సిరీస్ నెగ్గాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ పండితుల అభిప్రాయాలు, విశ్లేషణలతో అప్పుడే మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
అమ్మో.. అశ్విన్..
ఉపఖండకు పిచ్ లపై టీమిండియాతో టెస్ట్ సిరీస్ అంటే ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలే.. ఇక్కడ స్పిన్ బౌలర్ల ధాటిని తట్టుకొని పరుగుల సాధించడం మాటలు కాదు. మరి అలాంటి పరిస్థితి తట్టుకుని, సిరీస్ పట్టు సాధించేందుకు ఆసిస్ జట్టు అశ్విన్ బౌలింగ్ శైలిని పోలి ఉండే నెట్ బౌలర్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశ్విన్ ఆతిథ్య జట్టుకు ఎంత పెద్ద ముప్పో మనం అర్థం చేసుకొవచ్చు. అశ్విన్ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొని ఇబ్బందులు పడిని వారిలో ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 2012 నుంచి డేవిడ్ వార్నర్, అశ్విన్‌ను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంలో వార్నర్ కాస్త ఇబ్బంది పడుతాడనే విషయం తెలిసిందే. 10 మ్యాచ్‌లలో అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొన్న వార్నర్ 18.2 సగటుతో 182 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రస్తుతం వార్నర్ అత్యుత్తమ ఫామ్‌లో లేనప్పటికీ, అతని పేరిట ఇండియాలో రికార్డులు చెప్పకోదగ్గా లేవు. కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ట్రావిస్ హెడ్ గతేడాదిగా ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు వినిపిస్తుంది, టెస్ట్, వన్డే క్రికెట్‌లో అతని ఫాంపై ఆ జట్టు పెద్ద ఆశలే పెట్టుకుంది. భారత్‌లో ట్రావిస్ హెడ్‌కి ఇదే తొలి టెస్టు సిరీస్. ఆస్ట్రేలియాలో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, అతను ఉపఖండంలో రాణిస్తాడా.. లేదా అనేది చూడాలి. గతేడాది పాకిస్థాన్, శ్రీలంకలో ఐదు మ్యాచ్‌లలో 100 కంటే తక్కువ పరుగులే చేశాడు. దీన్ని బట్టి ఉపఖండంలో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ట్రావిస్ హెడ్‌కు అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు. అదేవిధంగా ఉస్మాన్ ఖవాజా ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్ మెన్, చివరిసారిగా అతను 2018లో భారత్ లో ఆడిన మ్యాచ్‌లల్లో రవిచంద్రన్ అశ్విన్ బంతులను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అతని బౌలింగ్‌లో 10 పరుగులు మాత్రమే చేసి, రెండుసార్లు ఔట్ అయ్యాడు. కానీ, ఒక్కసారి తను ఫామ్ లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదని కీ్రడా పండితులు చెబుతున్నారు.