Ashes 2023: మొయిన్‌ అలీకి ఐసీసీ బిగ్‌ షాక్.. భారీ జరిమానా

by Vinod kumar |
Ashes 2023: మొయిన్‌ అలీకి ఐసీసీ బిగ్‌ షాక్.. భారీ జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకీ ఐసీసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ను ఉల్లంఘించినందుకు మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అదే విధంగా అతడికి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఆసీస్ ఇన్నింగ్స్ 89 ఓవర్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మొయిన్‌ అలీ.. డ్రెయింగ్‌ ఏజెంట్‌తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు.

అయితే ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందే అంపైర్‌లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు. వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్‌లు గానీ స్ప్రేలు గాని చేయకూడదు. కానీ, అలీ అంపైర్‌ల రూల్స్‌ను అతిక్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed