Ashes 2023: మ్యాచ్‌కు వర్షం అంతరాయం..

by Vinod kumar |   ( Updated:2023-06-22 11:14:17.0  )
Ashes 2023: మ్యాచ్‌కు వర్షం అంతరాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023 సిరీస్ తొలి టెస్టులో 5వ రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించాడు. ఐదో రోజు ఆసక్తికర ఫలితం తేలనుందని అభిమానుల భావిస్తుంటే వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియా విజయానికి 90 ఓవర్లలో 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్ గెలవాలంటే ఏడు వికెట్లు తీయాలి. విజయావకాశాలు రెండు జట్లకూ సమానంగా ఉన్నాయి. వరుణుడు బర్మింగ్‌హోమ్‌లో నేటి ఉదయం నుంచి తన ప్రతాపాన్ని చూపతున్నాడు. మధ్యలో కొంతసేపు వర్షం తగ్గినా మ్యాచ్ ప్రారంభానికి ముందు మళ్లీ వర్షం మొదలవడంతో ఆటగాళ్లు ఎవరూ బయటకు రాలేదు.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆ జట్టు ఆసీస్ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 30 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (34 నాటౌట్), నైట్ వాచ్‌మెన్ స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఆఖరి రోజు 174 పరుగులు కావాలి. ఇంగ్లాండ్‌కు 7 వికెట్లు పడగొడితే విజయం ఆ జట్టు సొంతమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed