Ashes 2023 : డేవిడ్ వార్నర్ అరుదై ఘనత.. సెహ్వాగ్‌ రికార్డు బద్దలు

by Vinod kumar |
Ashes 2023 : డేవిడ్ వార్నర్ అరుదై ఘనత.. సెహ్వాగ్‌ రికార్డు బద్దలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ స్టార్ ఓపనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో అరుదై ఘనత సాధించాడు. Ashes 2023 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 36 ప‌రుగులు చేయగా.. టెస్టుల్లో అత్యధిక ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో భార‌త విధ్వంస‌క‌ర ఓపనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్ అధిగ‌మించాడు.

వార్నర్‌ 105 మ్యాచ్‌ల్లో 45.60 సగటుతో 8,208 పరుగులు చేశాడు. 99 మ్యాచ్‌ల్లో 50.04 సగటుతో 8,207 పరుగులు చేసిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను వార్నర్ అధిగ‌మించాడు. టెస్టుల్లో అత్యధిక ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ల జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. కుక్ 44.86 సగటుతో 11,845 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 50.29 సగటుతో 9,607 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..

అలస్టర్ కుక్ (ఇంగ్లాండ్‌) 11,845 ప‌రుగులు

సునీల్ గవాస్కర్ (ఇండియా) 9,607 ప‌రుగులు

గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా) 9,030 ప‌రుగులు

మాథ్యూ హేడెన్ (ఆసీస్) 8,625 ప‌రుగులు

డేవిడ్ వార్నర్ (ఆసీస్) 8,208 ప‌రుగులు

వీరేంద్ర సెహ్వాగ్ (ఇండియా) 8,207 ప‌రుగులు

Advertisement

Next Story

Most Viewed