వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీ.. సెమీఫైనల్లో ప్రథమేష్, అవ్నీత్

by Vinod kumar |
వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీ.. సెమీఫైనల్లో ప్రథమేష్, అవ్నీత్
X

షాంఘై: భారత యువ ఆర్చర్ల ద్వయం ప్రథమేష్ జాకర్, అవ్‌నీత్ కౌర్ బలమైన కొరియా సవాల్‌ను ఎదుర్కొని వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. 19 ఏళ్ల ప్రథమేష్ వ్యక్తిగత కాంపౌండ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో 149-148తో కొరియాకు చెందిన ఎనిమిదో సీడ్‌ను ఓడించాడు. సెమీస్‌లో ఎస్టోనియాకు చెందిన రాబిన్ జాత్మాతో తలపడునున్నాడు. ఇక మహిళల విభాగంలో 18 ఏళ్ల అవ్‌నీత్ కౌర్ 147-144తో మెక్సికోకు చెందిన డాఫ్నే కింటెరోపై విజయం సాధించింది.

సెమీస్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఎల్లా గిబ్సన్‌తో పోరుకు సిద్ధమైంది. ప్రథమేష్, అవ్‌నీత్ కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ పతకాలకు మరో గెలుపు దూరంలో ఉన్నారు. అయితే రికర్వ్ విభాగం టీమ్ ఈవెంట్‌లో ధీరజ్ బొమ్మదేవర, అటను దాస్, నీరజ్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు 0-6తో కొరియాకు చెందిన లీ వూ సియోక్, కిమ్ జె డియోక్, కిమ్ వూజిన్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.

Advertisement

Next Story

Most Viewed