'కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే.. మూల్యం తప్పదు'.. సౌతాఫ్రికా మాజీ పేసర్

by Vinod kumar |
కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే.. మూల్యం తప్పదు.. సౌతాఫ్రికా మాజీ పేసర్
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని, అలా చేస్తే మాత్రం ఆ బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయ ఎన్తిని తెలిపాడు. క్రికెట్‌లో ధాటిగా ఆడుతున్న బ్యాటర్లు.. బౌలర్లు స్లెడ్జింగ్ చేయడం ద్వారా తప్పుచేసి వికెట్ సమర్పించుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, అలాంటివి కోహ్లీ ముందు పనిచేయవని మఖాయ ఎన్తిని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అతను.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో బౌలర్లకు సూచనలు చేశాడు. ‘కోహ్లీ అస్సలు స్లెడ్జింగ్ చేయొద్దు. అతన్ని స్లెడ్జింగ్ చేస్తే మాత్రం ఆ బౌలర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు స్లెడ్జ్ చేయకపోతే అతను బోర్ ఫీల్ అయి ఏదో తప్పు చేస్తాడు.’ అని తెలిపాడు.

‘సౌతాఫ్రికా బౌలర్లకు ఒక్కటే చెబుతున్నా.. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా అనకండి. మళ్లీ చెబుతున్నా అతన్ని స్లెడ్జ్ చేయకండి. కోహ్లీకి పోటీ అంటే ఇష్టం. స్లెడ్జ్ చేస్తే అతను మిమ్మల్ని ఆడుకుంటాడు. అలాకాకుండా మీరు అతని ముందు సైలెంట్‌గా ఉండండి. అతనికి బోరు కొట్టి తప్పులు చేస్తాడు. అప్పుడు మీరు అతన్ని వికెట్ సాధించొచ్చు. అతనిలాంటి బ్యాటర్లతో బౌలర్లు స్మార్ట్‌గా వ్యవహరించాలి.’ అని వివరించాడు.

Advertisement

Next Story