BREAKING: పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్ట్స్‌కు చేరిన PV సింధు

by Satheesh |
BREAKING: పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్ట్స్‌కు చేరిన PV సింధు
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన బాడ్మింటన్ మహిళ సింగిల్స్ సెకండ్ రౌండ్‌లో సింధు ఏక పక్ష విజయం సాధించింది. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్‌పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. కేవలం అర్థ గంట (32 నిమిషాలు)లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి ఒలింపిక్స్‌లో మరో మెడల్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లింది. తాజా విజయంతో సింధు గ్రూప్-ఎన్ టాపర్‌గా నిలిచి రౌండ్-16 (ప్రిక్వార్ట్స్)కు చేరుకుంది. నెక్ట్స్ ప్రిక్వార్ట్స్‌ మ్యాచ్‌ను సింధు గురువారం ఆడనుంది. కాగా, సింధు రియో, టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ సింధుపై పతక ఆశలు భారీగానే ఉన్నాయి. మరీ సింధు ముచ్చటగా మూడో ఒలింపిక్ మెడల్ గెలుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed