- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
స్మృతి మందాన మరో రికార్డు
న్యూఢిల్లీ : టీం ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 'రేచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకుని 2021- ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 25 ఏళ్ల మందాన గతేడాది 22 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 855 పరుగులు చేసింది. 38.86 యావరేజ్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలను సాధించింది. సృతి మందాన రేచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2018లో స్మృతి ఈ ఘనతను సాధించింది.
టీం ఇండియా క్రీడాకారిణి స్మృతి మందాన ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అవ్వడం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జైషా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. 'ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వరుసగా రెండుసార్లు అందుకున్న భారత మహిళా ప్లేయర్‌గా స్మృతికి అభినందనలు.. ఆమె ఒక ట్రైల్‌బ్లేజర్ అని.. ఈ అవార్డు ఆమె కృషి, స్థిరత్వానికి ప్రతిబింబం' అని ట్వీట్ చేశారు.