బెల్జియన్ ఇంటర్నేషనల్ టైటిల్ అన్మోల్‌దే.. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్ కైవసం

by Harish |
బెల్జియన్ ఇంటర్నేషనల్ టైటిల్ అన్మోల్‌దే.. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ కెరీర్‌లో సీనియర్ లెవెల్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించింది. బెల్జియన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో అన్మోల్ 24-22, 12-21, 21-10 తేడాతో డెన్మార్క్ క్రీడాకారిణి అమాలీ షుల్జ్‌పై విజయం సాధించింది. వరల్డ్ నం. 222 ర్యాంక్‌లో ఉన్న అన్మోల్ తన కంటే మెరుగైన వరల్డ్ నం.88 ర్యాంకర్ అమాలీ షుల్జ్‌ను చిత్తు చేయడం విశేషం. 59 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అన్మోల్‌ను విజయం వరించింది. టోర్నీ ఆద్యంతం ఆమె సంచలన ప్రదర్శన చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌లను రెండు గేముల్లోనే నెగ్గిన ఆమె.. సెమీస్‌లో వరల్డ్ నం.68 కలోయానాను ఓడించింది.

Next Story

Most Viewed