70 ఏళ్లు దాటిన వారికి గుడ్‌న్యూస్.. 5 లక్షల మందికి బెనెఫిట్

by karthikeya |
70 ఏళ్లు దాటిన వారికి గుడ్‌న్యూస్.. 5 లక్షల మందికి బెనెఫిట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దీన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రాని 70 ఏళ్ల పైబడిన వయసు వారు తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. కేంద్ర పథకం వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్‌ కార్డులు అందజేస్తారు. ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్‌ భారత్‌కు పథకాల పేర్లలో తేడాలు ఉన్నా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రంలో 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్ కింద కవర్‌ అవుతుండగా, ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు అందుతున్నది.

Advertisement

Next Story

Most Viewed