Ravichandran Ashwin: చెన్నై టెస్టులో అశ్విన్ రికార్డులే రికార్డులు..కోర్ట్నీ వాల్ష్ రికార్డు బద్దలు..!

by Maddikunta Saikiran |
Ravichandran Ashwin: చెన్నై టెస్టులో అశ్విన్ రికార్డులే రికార్డులు..కోర్ట్నీ వాల్ష్ రికార్డు బద్దలు..!
X

దిశ, వెబ్‌డెస్క్:చెన్నై(Chennai)లోని చెపాక్(Chepauk) వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన తొలి టెస్టులో భారత్(India) 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భారత్ విజయం సాధించడంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో (113) శతకంతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసుకున్నాడు.ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

ఇదిలా ఉంటే..తమిళనాడు(Tamilanadu)కు 38 ఏళ్ల అశ్విన్ ఈ మ్యాచ్ లో పలు రికార్డులు సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్(West Indies) దిగ్గజ బౌలర్ కోర్ట్నీ వాల్ష్(Courtney Walsh) రికార్డును బ్రేక్ చేశాడు. కోర్ట్నీ వాల్ష్ ఖాతాలో 519 టెస్టు వికెట్లు ఉండగా.. అశ్విన్ టెస్టు వికెట్ల సంఖ్య 522కు చేరింది. ఇక ఈ జాబితాలో 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్Muttiah Muralitharan అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత వరుసగా షేన్ వార్న్‌(Shane Warne),జేమ్స్ అండర్సన్‌(James Anderson)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.అలాగే తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 37 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా(Australia) స్పిన్నర్ షేన్ వార్న్‌ను సమం చేశాడు.శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉండగా రిచర్డ్ హ్యాడ్లీ(Richard Hadley),అనిల్ కుంబ్లే(Anil Kumble)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా..

  • ముత్తయ్య మురళీధరన్ (Srilanka) –800 వికెట్లు
  • షేన్ వార్న్ (Australia) – 708 వికెట్లు
  • జేమ్స్ అండర్సన్ (England) – 704 వికెట్లు
  • అనిల్ కుంబ్లే (India) – 619 వికెట్లు
  • స్టువర్ట్ బ్రాడ్ (England) – 604 వికెట్లు
  • గ్లెన్ మెక్‌గ్రాత్ (Australia) – 563 వికెట్లు
  • నాథన్ లైయాన్ (Australia) – 530 వికెట్లు
  • రవిచంద్రన్ అశ్విన్ (India) – 522 వికెట్లు
Next Story

Most Viewed