పెళ్లికి సిద్ధమైన అక్షర్ పటేల్.. బర్త్‌డే రోజే ప్రేయసితో..

by Disha News Web Desk |
పెళ్లికి సిద్ధమైన అక్షర్ పటేల్.. బర్త్‌డే రోజే ప్రేయసితో..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లికి రెడీ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా కాబోయే భార్యను పరిచయం చేశాడు. గురువారం తన పుట్టిన రోజు నాడే చిన్ననాటి స్నేహితురాలు మేహాతో ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేశాడు. "ఈ రోజు మా కొత్త జీవితానికి ఆరంభం, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అని కామెంట్ పెట్టాడు. దీనితో అక్షర్ పటేల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అక్షర్ పటేల్ వచ్చిన అవకాశాలను వినియోగించుకుని టీమిండియాకు కీలక బౌలర్‌గా ఎదిగాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అక్షర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

https://www.instagram.com/akshar.patel/p/CY9bsjFvWDb/?utm_medium=copy_link


Advertisement

Next Story