- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Akash Madhwal :ఎవరీ నయా సెన్సేషన్.. ముంబై యువ పేసర్ ఆకాశ్ మద్వాల్ గురించి ఆరా..
దిశ, వెబ్‌డెస్క్: ఆకాశ్ మద్వాల్.. ఈ ముంబై ఇండియన్స్ యువ పేసర్ గురించే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ. ఐపీఎల్-16లో ముంబై క్వాలిఫయర్స్-2కు చేరిందంటే అతనే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంతితో విజృంభించి లక్నో పతనాన్ని శాసించిన అతని గురించి తెలుసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిచూపుతున్నారు. గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అసలు ఎవరీ ఆకాశ్ మద్వాల్..
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఆకాశ్ మద్వాల్ జన్మించాడు. రూర్కీ అనగానే టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గుర్తొస్తాడు. పంత్ కూడా రూర్కీలోనే జన్మించాడు. పంత్ పొరుగింట్లోనే ఆకాశ్ ఉంటున్నాడు. అంతేకాదు, పంత్ శిక్షణ పొందిన కోచ్ అవతార్ సింగ్ వద్దనే ఆకాశ్ కూడా శిక్షణ పొందాడు. 2016లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా సాధించిన అతను కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. క్రికెట్‌పై మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి సీరియస్‌గా కష్టపడ్డాడు. 24 ఏళ్ల వరకు ఆకాశ్ టెన్నిస్ బాల్‌తోనే ప్రాక్టీస్ చేసేవాడు. యార్కర్స్ వేయడంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నాడు. 2018లో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడింది.
అప్పుడు నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టులోకి వచ్చాడు. 2019లో అతను దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు ఉత్తరాఖండ్ జట్టుకు ఆకాశ్ ఎంపికయ్యాడు. అప్పటి నుంచే అతను రెడ్ బాల్‌తో ఆడటం మొదలుపెట్టాడు. ఉత్తరాఖండ్ జట్టు మాజీ హెడ్ కోచ్, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆకాశ్‌లోని ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించాడు. ప్రస్తుతం కోచ్ తోపాటు ప్రస్తుత కోచ్ మనీష్ ఝా నేతృత్వంలో ఆకాశ్ మరింత రాటుదేలాడు. దేశవాళీలో అద్భుత రాణిస్తున్న ఆకాశ్.. 2023 సీజన్‌కు ముందు ఉత్తరాఖండ్ టీ20 జట్టుకు సారథిగా నియామకమయ్యాడు. దేశవాళీలో 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు, 17 లిస్ట్ ఏ 18 వికెట్లు, 22 టీ20 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీశాడు.
ఆర్సీబీ నెట్ బౌలర్‌గా..
ఐపీఎల్-2021 సీజన్‌లో ఆకాశ్ ఆర్సీబీ జట్టులో నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. ఈ సమయంలో దిగ్గజ క్రికెటర్లైనా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ బౌలింగ్ చేయడం ద్వారా తన బౌలింగ్‌లో నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు అవకాశం దొరికింది. ఆ తర్వాత గతేడాది సూర్యకుమార్ గాయం కారణంగా లీగ్‌కు దూరం కావడంతో ముంబై ఇండియన్స్ అతని స్థానంలో ఆకాశ్‌ను తీసుకుంది. కానీ, అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ముంబై కూడా అతన్ని నెట్‌బౌలర్‌గా వినియోగించుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనూ అతనికి తుది జట్టులో ఆడే చాన్స్ దక్కలేదు. జోఫ్రా ఆర్చర్ లీగ్ నుంచి తప్పుకోవడంతో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ సత్తాచాటాడు. 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.
ముంబైలో కీలక బౌలర్‌గా..
ఈ సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా దూరమవడం ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. బుమ్రా లోటును జోఫ్రా ఆర్చర్ తీరుస్తాడని ముంబై జట్టు ఆశించింది. కానీ, అతను గొప్ప ప్రదర్శనేం చేయలేదు. అలాగే, గాయం కారణంగా లీగ్ మధ్యలోనే వైదొలిగాడు. అప్పుడు రోహిత్ దృష్టి ఆకాశ్ మద్వాల్‌పై పడింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో అవకాశం ఇచ్చాడు. అయితే, ప్రారంభ మూడు మ్యాచ్‌ల్లోనూ అతను 6 ఓవర్లలో ఒకే వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ, అతనిపై ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచి తుది జట్టులో కొనసాగించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాచాటాడు.
ఆ తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే హైదరాబాద్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో మెరిసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక, లక్నతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏకంగా సంచలన ప్రదర్శన చేశాడు. 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో ఆకాశ్ ముంబై జట్టులో కీలక బౌలర్‌గా మారిపోయాడు. మరి, క్వాలిఫయర్-2లోనూ ఆకాశ్ ఇదే ప్రదర్శన చేయాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే, ఈ సీజన్‌లో బుమ్రా లేని లోటును ఆకాశ్ భర్తీ చేశాడని ప్రశంసిస్తున్నారు.