Ajinkya Rahane: 'నేనింకా కుర్రాడినే'.. ఏజ్‌పై ఆడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన రహానే!

by Vinod kumar |
Ajinkya Rahane: నేనింకా కుర్రాడినే.. ఏజ్‌పై ఆడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన రహానే!
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లో రాణించడంతో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు విండీస్ టూర్‌కు రీఎంట్రీ లభించింది. ఈ సిరీస్‌లో అతనికి మళ్లీ వైస్ కెప్టెన్సీ అందజేయడం విశేషం. ఈ క్రమంలో తొలి టెస్టుకు ముందు మీడియాతో రహానే మాట్లాడాడు. ఈ సందర్భంగా ఈ వయసులో రీఎంట్రీ గురించి విలేకరులు అతన్ని ప్రశ్నించారు. దీనికి రహానే అదిరిపోయే జవాబిచ్చాడు. తను ఇంకా కుర్రాడినేనని, తనలో ఇంకా చాలా క్రికెట్ ఉందని చెప్పుకొచ్చాడు.

'ఈ ఏజ్‌లో అంటే..? నేను ఇంకా యంగ్‌గానే ఉన్నా. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఐపీఎల్‌లో నేను బాగా ఆడా. అంతకుముందు దేశవాళీల్లో కూడా రాణించా' అని రహానే నొక్కి చెప్పాడు. తన బ్యాటింగ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని, కొన్ని లోటుపాట్లను సరిచేసుకున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం జరిగే ప్రతి మ్యాచ్ నాకు ముఖ్యమే. అది నాకు వ్యక్తిగతంగానే కాదు. టీం పరంగా కూడా ప్రతి మ్యాచ్ ముఖ్యమే. నేను కూడా దాని మీదనే ఫోకస్ పెడుతున్నాని రహానే స్పష్టం చేశాడు.

Advertisement

Next Story