- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దీపక్ శర్మపై వేటు
దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై వేటు పడింది. దీపక్ శర్మ తాగొచ్చి తమపై దాడి చేశాడని ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఏఐఎఫ్ఎఫ్ మంగళవారం అతన్ని సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దీపక్ శర్మ ఎలాంటి ఫుట్‌బాల్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. గోవాలో జరుగుతున్న ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ సెకండ్ డివిజన్ టోర్నీ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాద్ ఫుట్‌బాల్ క్లబ్ అక్కడికి వెళ్లింది. ఈ నెల 28న రాత్రి దీపక్ శర్మ తాగి రూంకు వచ్చి తమపై దాడి చేశాడని ఆ క్లబ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఏఐఎఫ్ఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిర్యాదుతో దీపక్ శర్మను గోవా పోలీసులు అరెస్ట్ చేయగా.. అతను బెయిల్‌పై బయటకు వచ్చాడు.