దూకుడుతోపాటు పర్ఫామెన్సూ ఉండాలి : సౌరవ్ గంగూలీ

by Vinod kumar |
దూకుడుతోపాటు పర్ఫామెన్సూ ఉండాలి : సౌరవ్ గంగూలీ
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా క్రికెటర్లు దూకుడుగా ఉండటం మంచిదేనని, అయితే, పర్ఫామెన్స్ కూడా బాగుండాలని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వరుసగా రెండోసారి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌కు చేరుకున్న టీమ్ ఇండియా మరోసారి తుది పోరులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ టీమ్ ఇండియా ఆటతీరుపై విశ్లేషించాడు.

కొంతకాలంగా క్రికెట్ మారుతోందని, టీమ్ ఇండియా ఆట తీరు కూడా మారాలన్నాడు. ‘దూకుడుగా ఉండటం మంచిందే. కానీ, ప్రదర్శన కూడా కావాలి కదా. గతంలో 2001 నుంచి 2006 మధ్య భారత బ్యాటర్లు సిడ్నీ, బ్రిస్బేన్, హెడ్డింగ్లీ, నాటింగ్‌హామ్, ఓవల్, పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్ వంటి పెద్ద స్టేడియాల్లో 500 నుంచి 600 పరుగులు చేశారు. దాంతో ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టారు. కాబట్టి, ప్రస్తుతం టీమ్ ఇండియా ఆ పని చేయాలి.

పదేళ్ల క్రితంతో పోలిస్తే క్రికెట్‌లో మార్పులు వచ్చాయి. పరిస్థితులు, పిచ్‌లు మారాయి. కానీ, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 350 నుంచి 400 మధ్య పరుగులు చేయాలి’ అని గంగూలీ తెలిపాడు. అయితే, టీమ్ ఇండియాపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. ‘2021లో ఇంగ్లాండ్‌లో బాగా ఆడాం. అంతకుముందు ఆస్ట్రేలియాలోనూ మంచి క్రికెటే ఆడాం. రిషబ్ పంత్ చివరి రోజు అద్భుతంగా ఆడి సిరీస్‌ను కట్టబెట్టాడు. ఇదంతా నమ్మకంతోనే జరుగుతుంది. అయితే, ఎక్కువ క్రికెట్‌ ఆడటం, ఎక్కువ గంటలు ప్రయాణించడం ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయి. కానీ, ఆటగాళ్లు పుంజుకోవాలి. ఇది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నా’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed