అప్పట్లో అఫ్గాన్.. ప్రస్తుతం నేపాల్.. బీసీసీఐ ప్రకటన

by Shamantha N |   ( Updated:2024-02-03 12:38:53.0  )
అప్పట్లో అఫ్గాన్.. ప్రస్తుతం నేపాల్.. బీసీసీఐ ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్: దశాబ్ద కాలంగా అఫ్గాన్ క్రికెట్ కు మద్దతుగా నిలిచి బీసీసీఐ.. ప్రస్తుతం నేపాల్ క్రికెటర్లకు సాయం అందించేందుకు సిద్ధమైంది. దక్షిణాసియాలో క్రికెట్ ను అభివృద్ధి చేసే లక్ష్యంతో నేపాల్ ప్లేయర్లకు సాయం చేయనుంది. టాలెంటెడ్ ప్లేయర్లకు మౌలిక సదుపాయాలు అందించేందుకు రెడీ అయ్యింది. నేపాల్ జాతీయ జట్టుకు ఢిల్లీలో శిక్షణ ఇవ్వనుంది. టీ20 వరల్డ్ కప్ లో సన్నాహక గేమ్ లు ఆడే అవకాశం ఉంది.

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చతుర్ బహదూర్ బీసీసీఐ సెక్రటరీ జైషాతో భేటీ అయ్యారు. నేపాల్ క్రికెటర్లుకు సాయం చేయాలని కోరినట్లు సమాచారం. నేపాల్ క్రికెట్ ను ప్రోత్సహించేందుకు జైషా మద్దతుగా ఉన్నారన్నారు బహదూర్.

గతంలో అఫ్గాన్ జాతీయజట్టు, అండర్ 19 జట్టు ఢిల్లీలో శిక్షణ పొందాయి. అలాగే రాబోయే రోజుల్లో నేపాల్ క్రికెట్ వృద్ధికి సాయం చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నేపాల్ క్రికెట్‌కు మూడు రంగాల్లో సాయం అవసరం అంది నేపాల్ క్రికెట్ బోర్డు. టీ20 ప్రపంచకప్ కు ముందు శిక్షణాశిబిరం కావాలని.. అది ఖాట్మండులో సాధ్యం కాదని వివరించింది. రెండోది బెంగళూరులో అప్ గ్రేడ్ చేసిన నేషనల్ క్రికెట్ అకాడమీ సౌకర్యాలు వినియోగించునేలా అనుమతి కావాలని కోరింది. అండర్ -19, నేపాల్-ఏ క్రికెటర్లకు మ్యాచ్ ఎక్స్ పోజర్ కావాలని తెలిపింది. మరోవైపు గతేడాది ఖాట్మండులో ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్‌ను నిర్వహించడంలో బీసీసీఐ సాయం చేసిందని తెలిపింది నేపాల్ క్రికెట్ బోర్డు.

Read More..

17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జైశ్వాల్.. ఇంకా ఏయే ఏయే రికార్డులు సాధించాడంటే?

Advertisement

Next Story