అఫ్గాన్ 155 ఆలౌట్.. విజృంభించిన ఐర్లాండ్ బౌలర్లు

by Swamyn |
అఫ్గాన్ 155 ఆలౌట్.. విజృంభించిన ఐర్లాండ్ బౌలర్లు
X

దిశ, స్పోర్ట్స్: అఫ్గాన్, ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు బుధవారం ప్రారంభమైంది. అబుధాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌కు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. మార్క్ అడైర్ ఐదు వికెట్లతో చెలరేగడంతో అఫ్గాన్ కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(53), 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరీమ్ జనత్(41నాటౌట్) మినహా మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ 155 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. తొలి రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కర్టిస్ కంఫర్(49) అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హ్యారీ టెక్టార్(32 బ్యాటింగ్), పాల్ స్టిర్లింగ్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఐర్లాండ్ ఇంకా 55 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.


Advertisement

Next Story