- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుర్బాజ్ శతకం.. తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు
దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం చేసింది. షార్జా వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్(121) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(60) సైతం రాణించగా.. అతనితో కలిసి గుర్బాజ్ తొలి వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. వీరి తర్వాత కెప్టెన్ షాహిది(50 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. నబీ(40) విలువైన పరుగులు జోడించడంతో అఫ్గాన్ 300 పరుగుల మార్క్‌ను దాటింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ పోరాడి ఓడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తడబడిన ఆ జట్టును హ్యారీ టెక్టర్(138) ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన అతను శతకంతో సత్తాచాటాడు. లోర్కాన్ టక్కర్(85) సైతం మెరిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 173 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పోటీలోకి తెచ్చారు. అయితే, అఫ్గాన్ బౌలర్లు పుంజుకుని ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా ఫజల్హక్ ఫరూఖీ 4 వికెట్లతో చెలరేగడంతో ఐర్లాండ్‌కు ఓటమి తప్పలేదు. మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం ఇదే వేదికపై రెండో వన్డే జరగనుంది.