- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఏసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో సంచలనం..
X
దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో హాంగ్ కాంగ్ ఉమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్లలో.. శ్రేయాంకా పాటిల్ 5 వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్‌లు తలా 2 వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు 1 వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్‌గా కొనసాగుతున్నారు.
Advertisement
Next Story