- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంభీర్‌పై వేటు?.. కీలక వ్యాఖ్యలు చేసిన ఆకాశ్ చోప్రా
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా అవమానకర టెస్టు సిరీస్ ఓటమితో కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గంభీర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కోల్పోతే బీసీసీఐ వేర్వేరు జట్లకు వేర్వేరు కోచ్‌లను నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గంభీర్‌ను టెస్టు టీమ్ కోచ్‌గా తప్పించి వైట్‌బాల్‌కే పరిమితం చేసి, వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్టు కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఆ వార్తలను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొట్టిపారేశాడు.
వేర్వేరు జట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారనేది కచ్చితంగా రూమరే అని వ్యాఖ్యానించాడు. ‘ఆ వార్తలు నిరాధారణమైనవి. గంభీర్ ఇప్పుడే ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. దురుద్దేశంతో ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని భావిస్తున్నా. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్‌ను తొలగించడం జరగదు. అలాంటి ఆలోచనలతో కూడా నేను ఏకీభవించను. ఆ వార్తలను ఖండిస్తున్నా.’ అని తెలిపాడు. అలాగే, గంభీర్ అడిగినవాటన్నింటినీ బీసీసీఐ ఇచ్చిందని, అలాంటప్పుడు ఫలితాలు రాకపోతే ప్రశ్నలు తప్పవన్నాడు. జవాబుదారీతనం ఉండాలని చెప్పాడు.