- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
34 బంతుల్లో సూపర్ సెంచరీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ వేదికగా టీ20 బ్లాస్ట్ లీగ్ నడుస్తుంది. ఈ లీగ్‌లో బాగంగా..ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ సీన్ అబాట్ టీ20 క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియన్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రికార్డును సమం చేశాడు. సర్రే జట్టు తరఫున ఆడుతున్న అబాట్.. కేవలం.. 34 బంతుల్లో సెంచరీ చేసి.. మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ రికార్డును సమం చేశాడు. అలాగే అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో మొదట్లో సర్రే జట్టు కీలక ఆటగాళ్లు తక్కువ పరుగులకు అవుట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన అబాట్.. 41 బంతుల్లో 11 సిక్సర్లు 4 ఫోర్లతో మొత్తం 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సర్రే జట్టు ఐదు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా ఈ మ్యాచ్ లో సర్రే.. 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Advertisement
Next Story