వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..

by Mahesh |   ( Updated:2023-02-07 04:43:26.0  )
వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో జరగబోయే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆరోన్ ఫించ్ తన 12 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెట్ కెరీర్‌కు తెర దించుతూ.. T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫించ్ గత సంవత్సరం.. సెప్టెంబర్ లో.. వన్డే క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. 2024 లో జరిగే తదుపరి T20 ప్రపంచ కప్ వరకు నేను ఉండబోనని గ్రహించి, ఇప్పుడే వైదొలగడానికి సరైన సమయం అని భావిస్తున్నాను.. అని.. ఫించ్.. మీడియాతో తెలిపారు. కాగా అతను టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో తన ఇంటర్నేషనల్ క్రికెట్ కూ పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసాడు.

ఫించ్.. తన కెరిర్ లో.. ఆస్ట్రేలియా తరపున 103 మ్యాచ్‌లు ఆడాడు. వీటిల్లో 76 మ్యాచ్‌లకు ఫించ్ కెఫ్టెన్ గా నాయకత్వం వహించాడు. అతను.. అతను 34.28 సగటుతో మరియు 142.5 స్ట్రైక్ రేట్‌తో 3120 పరుగులు చేశాడు. దీంతో ఫించ్ టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా ప్రధాన రన్-గెటర్‌గా పదవీ విరమణ చేశాడు. అతని కెరీర్-బెస్ట్ 172, 2018లో జింబాబ్వేపై, ఆ ఫార్మాట్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు, అతను 2013లో ఇంగ్లండ్‌పై 156 పరుగులతో గతంలో సాధించిన రికార్డు. అతను ఆస్ట్రేలియా తరపున ఐదు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు.

Also Read...

టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ తమ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామం

Advertisement

Next Story

Most Viewed