ప్రబోధానంద యోగీశ్వరులు శివైక్యం

by srinivas |
ప్రబోధానంద యోగీశ్వరులు శివైక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద యోగీశ్వరులు శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామంలోని తన ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. 1950లో జన్మించిన ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి.. మొదట్లో భారత సైన్యంలో వైర్ సెల్ ఆపరేటర్‌గా పనిచేశారు. సమాజానికి దైవ జ్ఞానము అందించాలన్న ఆయన కోరిక మేరకు అధికారులు సైన్యం నుంచి పంపారు.

1978 నుంచి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం ప్రారంభించిన ప్రబోధానంద యోగీశ్వరులు.. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని చెప్పారు. ఈ క్రమంలోనే హిందూ, ముస్లిం దేవుళ్ళ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. రెండేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. కడప జిల్లా కొండాపురం మండలం బెడుదురు కొట్టాలపల్లికి ప్రబోధానంద పార్థివదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో కేవలం 20మందితో మాత్రమే కార్యక్రమం జరిగిలా చూడాలని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story