- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హంతకుడిని పట్టించిన అక్షర దోషం
దిశ, వెబ్‌డెస్క్:
మెసేజ్‌లు టైప్ చేసేటపుడు స్పెల్లింగ్‌లో తప్పులు దొర్లడం చాలా సహజం. అయితే కొందరికి టైపో ఎర్రర్‌లు దొర్లితే, మరికొందరికి ప్యాటర్న్ ఎర్రర్‌లు దొర్లుతాయి. అంటే ఉదాహరణకు కొందరు ఏంటి? స్పెల్లింగ్‌ను Enti? అని రాస్తే, మరికొందరు Anti? అని రాస్తారు. ఇలాంటి వాటిని ప్యాటర్న్ ఎర్రర్‌లు అంటారు. అంటే తప్పు స్పెల్లింగ్ అయినప్పటికీ వారు అదే ఉపయోగిస్తుంటారు. ఇలాంటి ఒక అక్షర దోషమే ఇప్పుడు ఒక హంతకుడిని పట్టించింది. ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఆ యువకుడిని అక్షర దోషం ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో అక్టోబర్ 26న 22 ఏళ్ల రామ్ ప్రతాప్ సింగ్ తన దూరపు బంధువుల అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. అదే రోజు సాయంత్రం ఒక ఫోన్‌ను దొంగిలించి, అబ్బాయి తండ్రికి ఇలా మెసేజ్ పెట్టాడు. ‘Do lakh rupay Seeta-Pur lekar pahuchiye. Pulish ko nahi batana nahi to haatya kar denge’. అంటే రెండు లక్షల రూపాయలతో సీతాపూర్‌కి రండి, పోలీస్‌కు చెప్తే చంపేస్తానని అర్థం. దీని గురించి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఓ పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో ‘Main police main bharti hona chahta hoon. Main Hardoi se Sitapur daud kar ja sakta hoon’ (నేను పోలీసు అవ్వాలనుకుంటున్నాను. నేను హర్దోయ్ నుంచి సీతాపూర్ వరకు పరుగెత్తగలను) అని రాయించారు.
ఇక్కడ రెండు వాక్యాల్లో ఒక ప్యాటర్న్ ఉంది. హంతకుడు పోలీసు స్పెల్లింగ్‌ను Pulish అని, సీతాపూర్ స్పెల్లింగ్‌ను Seeta-Pur అని తప్పుగా రాశాడు. పది మంది అనుమానితుల్లో ఒక్కడు మాత్రమే అలా రాసి, పట్టుబడి పోయాడు. ఇక్కడ విషాదం ఏంటంటే.. కిడ్నాప్ చేసిన బాలుడిని ఆ మరుసటి రోజునే రామ్ ప్రతాప్ సింగ్ హత్య చేసి చంపేశాడు.