పుట్ట మధు స్థానంలో కందుల సంధ్యారాణి..?

by Sridhar Babu |
పుట్ట మధు స్థానంలో కందుల సంధ్యారాణి..?
X

దిశ, పెద్దపల్లి : పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పదవిపై చర్చలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్ తర్వాత జడ్పీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలి అనే దానిపై పార్టీ అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ బీసీ జనరల్ సామాజిక వర్గానికి కేటాయించిన నేపథ్యంలో పాలకుర్తి జెడ్పీటీసీ సి కందుల సంధ్యారాణి పేరు పార్టీ వర్గాల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పుట్ట మధు పై కేసు నమోదైతే జడ్పీ చైర్మన్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కందుల సంధ్యారాణి పేరు పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, సాధ్యాసాధ్యాల పైన అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed