- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఔట్ పేషెంట్లకు ప్రత్యేక క్లినిక్‌లు
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా క్లినిక్‌ను ప్రారంభించాలని సీఎస్ సోమేష్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఆదివారం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో, డిప్యూటీ కమిషనర్లతో ఆయన టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించి, కరోనా లక్షణాలున్న వారందరికీ హోం ట్రీట్‌మెంట్ కిట్లను అందజేయాలని సూచించారు.
వారితో కలిపి టీం ఏర్పాటు
ఒక మున్సిపల్ స్టాఫ్, ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశా వర్కర్లను బృందాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఈ బృందాలను వినియోగించాలని తెలిపారు. కరోనా పేషెంట్లకు వైద్య సలహాలు, సూచలను అందించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా వైట్ వాషింగ్ వంటి చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని సర్కిల్‌లలో కొవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించి పేషెంట్లకు సేవలు అందించాలని ఆదేశించారు.