మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక విభాగాలు

by Sumithra |
మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక విభాగాలు
X

దిశ, క్రైమ్ బ్యూరో: మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీస్‌శాఖ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 31యూనిట్లను స్థాపించేందుకు సిబ్బందిని నియామకం చేస్తోంది. హైదరాబాద్ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ , తరుణి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ యాంటీ హుమన్ ట్రాఫికింగ్ మోడల్ యూనిట్‌ను లక్డీకపూల్ ఉమెన్ సేఫ్టీ విభాగంలో అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతిలక్రా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధానికి తెలంగాణ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా అక్రమ రవాణా జరగకుండా చూడటం, బాధితులకు సత్వర న్యాయం చేయడం సాధ్యం అవుతోందన్నారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ అక్రమ రవాణాకు సంబంధించిన ప్రతి కేసును మహిళా రక్షణ విభాగం పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ లెర్నింగ్, వెబ్ పోర్టల్ ద్వారా అక్రమ రవాణా గురించి సమాచారం అందేలా చేయగలుగుతామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రిటీష్ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ ఎనలిస్ట్ నళిని రఘురామన్, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మమతా రఘువీర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story