మహేశ్ బర్త్‌డే మానియా.. టాలీవుడ్ సెలబ్రిటీలతో ట్విట్టర్ చాట్

by Shyam |
Tollywood celebs
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఆగస్టు 9న 46వ సంవత్సంరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌, యాక్టర్స్‌.. సోమవారం రాత్రి 7.02 గంటలకు షెడ్యూల్ చేయబడిన ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొని మహేశ్ గురించి మాట్లాడనున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ కూడా #AskAboutSSMB హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రిటీలను ట్యాగ్ చేసి ఏవైనా ప్రశ్నలను అడిగితే వారు సమాధానమిస్తారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ పేజీ ‘SSMB స్పేస్’ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది.

ఇక సెలబ్రిటీల లిస్టులో డైరెక్టర్ శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, పరశురాం, సందీప్ రెడ్డి వంగా, గోపిచంద్ మలినేని, బాబీ, మెహర్ రమేశ్‌, నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, గోపి మోహన్, కోన వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ తదితరులు పాల్గొ్ననున్నారు. యాక్టర్స్ విషయానికొస్తే.. అల్లరి నరేశ్, అడివి శేషు, సుధీర్ బాబు, బ్రహ్మజీ కూడా ఈ డిస్కషన్‌లో జాయిన్ అవుతారు. అంతేకాదు సోమవారం ఉదయం 9.09 గంటలకు మహేశ్ అప్‌కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి ఓ వీడియోను కూడా రిలీజ్ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed