సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

by Shamantha N |
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
X

దిశ, కంటోన్మెంట్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్‌, హౌరా, ముంబాయి, న్యూ ఢిల్లీ, గౌహతి, దానాపూర్‌, జైపూర్‌, నాగపూర్‌, నాందేడ్‌, పర్బాని, ఔరంగాబాద్‌, సిర్పూర్​కాగన్​నగర్​ మొదలగు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. పండుగ ప్రత్యేక రైళ్లు అన్ని పూర్తిగా రిజర్వేషన్ల రైళ్లేనని, కన్ఫర్మర్డ్​ టికెట్‌ లేని ప్రయాణికులకు స్టేషన్​లోకి అనుమతి లేదన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సరిపడు రిజర్వేషన్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ప్రయాణికులు కింది మార్గదర్శకాలను ఫాలో కావాల్సి ఉంటుంది.
* కనఫార్మర్డ్‌ టికెట్లున్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లలోకి, రైళ్లలోకి అనుమతిస్తారు.
* ప్రయాణంలో మాస్క్‌లు ధరించాలి.
* స్టేషన్లలో, రైళ్లలో భౌతిక దూరం పాటించాలి.
* జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న వ్యక్తులు ప్రయాణం చేయవద్దు.
* కొవిడ్​ పాజిటివ్‌ వ్యక్తులు రైల్వే పరిసరాలకు, రైళ్లలోకి అనుమతించబడరు.
* స్టేషన్లలో నియమించబడిన ఆరోగ్య బృందం ప్రయాణానికి అనుమతించని వారు కూడా రైళ్లలో ప్రయాణిస్తే నేరంగా పరిగణించబడుతుంది.
* బహిరంగ ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా ఉమ్మి వేయడం, మలమూత్ర విసర్జన సైతం నేరమే.
* రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతపై చెడు ప్రభావం చూపేలా అపరిశుభ్రమైన లేదా అనారోగ్యమైన పరిస్థితులకు కారణమవడం శిక్షార్హం.

కొవిడ్​ నివారణ ప్రొటోకాల్​ను ఎవరైనా పాటించనిచో రైల్వే చట్టం 1989 ప్రకారం కఠిన చర్యలుంటాయి.

పండుగ దృష్ట్యా ప్రత్యేక చర్యలు
* సరైన టిక్కెట్లు లేని ప్రయాణికుల తనిఖీ కోసం రైల్వే స్టేషన్ల వద్ద, రైళ్లలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేశారు.
* రెగ్యులర్‌, చివరి నిమిషంలో ప్రయాణం కోసం స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం పీఆర్‌ఎస్‌ కేంద్రాలు, స్టేషన్ల వద్ద సరిపడ రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
* పండుగ ప్రత్యేక రైళ్లన్నీ ముందస్తుగా రిజర్వు చేయబడిన రైళ్లు అనే సమాచారాన్ని ప్రయాణికులకు నిరంతరంగా తెలిపేలా అన్ని స్టేషన్లు, పీఆర్‌ఎస్‌ కౌంటర్ల వద్ద ఏర్పాట్లు చేశారు.
* అన్ని రైళ్లు రిజర్వుడ్​, వెయిటింగ్​ లిస్ట్‌ టికెట్‌ గల ప్రయాణికుల రైలు ఎక్కవద్దన సూచన కోసం నిరంతరం రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story