- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముంబై నుంచి గుంతకల్లు చేరిన వలస కార్మికులు
దిశ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న అనంతపురం జిల్లా వాసులు గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.
ఈ రైలులో సుమారు 1,100 వలస కార్మికులు రైల్వే శాఖ నడిపిన 24 బోగీల రైలులో గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్వరాష్ట్రానికి చేరారు. వీరిలో అత్యధికులు ఉరవకొండ పరిసరాల కార్మికులు ఉండడం విశేషం. ఈ రైలులో ప్రయాణించిన వారి రైలు టిక్కెట్ చార్జీలు, భోజనం, టిఫిన్, మంచినీరు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వమే చేయడం విశేషం. గుంతకల్లు చేరుకున్న అనంతరం వలసకార్మికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో గుంతకల్లు చేరుకున్న కార్మికులందరికీ అధికారులు థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించారు. అనంతరం వారందర్నీ ప్రత్యేక బస్సుల్లో వారి గ్రామాలకు దగ్గర్లో ఉండే క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారందరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ వస్తే వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించనున్నారు. లేని పక్షంలో వారిని గ్రామాలకు తరలించి, మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సలహా ఇస్తున్నారు.
Tags: lockdown, migrant workers, mumbai to guntakal, special train