కరోనాతో కందుతున్న చిన్నారుల చేతులు..

by Anukaran |   ( Updated:2021-06-11 23:27:04.0  )
కరోనాతో కందుతున్న చిన్నారుల చేతులు..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సామాన్యుడి నుండి అసామాన్యుడి వరకు ఏదో ఒకరూపంలో వారి జీవితాలపై దెబ్బ కొడుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలైతే కరోనా విలయతాండవానికి కాకావికలం అవుతున్నాయి. పెంచి పోషించాల్సిన కుటుంబ పెద్ద కరోనాతో కాటికి పోతే.. కుటుంబాన్ని సాకాల్సిన బాధ్యత తల్లిపై పడుతోంది. కొన్ని కుటుంబాల్లో దయలేని కరోనా మహమ్మరి తల్లిదండ్రులను కబలించడంతో లోకం తీరు తెలియని చిన్నారులే కుటుంబ పోషణను నడుం బింగించాల్సి వస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో మొదటిసారిగా చిన్నారులు తిరిగి శ్రమజీవులవుతున్నారని బాలకార్మికుల వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది. ఓ కుటుంబంలోని తల్లి,తండ్రి.. ఇద్దరు పిల్లలు రాము (15), వసుధ (13). ఈ కుటుంబంలోని తల్లిదండ్రులు కరోనా రక్కసి కొరల్లో చిక్కుకొని తిరిగి రానిలోకాలకు వెళ్లారు.

ఆ చిన్నారులకు అబంధువులున్నా బాసటగా నిలువలేకపోయారు. ప్రభుత్వాలు సైతం పట్టించుకోలేదు. దీంతో చూసే దిక్కులేక అన్నితానై రామునే కూలీ పనికి సిద్ధమయ్యాడు. ఇలాంటి సంఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొవిడ్ తీవ్రత పెరుగుతున్న కొద్ది ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు బాలకార్మికులుగా మారుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేటి సమాజంలో చిన్నారులు బాలకార్మికులుగా కాకుండా ఉండేందుకే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ప్రయోజనం మాత్రం శూన్యంగా మిగిలిపోతోంది. బాలకార్మికుల వ్యవస్థను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అప్పుడే నేటి బాలలు రేపటి భావితరాలకు బాటల వేసే గొప్ప ప్రముఖులుగా కీర్తికెక్కగలరు.

Advertisement

Next Story

Most Viewed