'చావుకూడా పెళ్లి లాంటిదే బ్రదర్'

by Anukaran |   ( Updated:2021-02-25 05:05:50.0  )
చావుకూడా పెళ్లి లాంటిదే బ్రదర్
X

దిశ,వెబ్‌డెస్క్: ఓ ఏడెనిమిది మంది కుర్రాళ్లు. సూటూ బూటూ ధరించి పక్కా ప్రొఫెషనల్ గా శవ పేటికను మోస్తూ డ్యాన్స్ వేస్తుంటారు. ఆ డ్యాన్స్ కూడా శవపేటిక మోసే సమయంలో వచ్చే రిథమ్ కు తగ్గట్లుగానే ఉంటుంది. ఆ సమయంలో వీళ్లని ఎవరు చూసినా అరె వీళ్లు డ్యాన్స్ భలే వేస్తున్నారే’ అని అనక మానరు. అంతగా పాపులర్ అయ్యింది ఈ కొఫిన్ డ్యాన్స్. ఈ డ్యాన్స్ 2003 నుంచి ప్రారంభమైనా 2017లో వెలుగులోకి వచ్చింది. 2020 కరోనాతో మీమ్స్ రూపంలో బాగా పాపులర్ అయ్యింది.

ఓ దేశంలో మరణించిన వారి డెడ్ బాడీలను మోసే సమయంలో డ్యాన్స్ వేసే సాంప్రదాయం ఉందంటూ అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఇది సాంప్రదాయం కాదు పక్కా ప్రొఫెషనల్ బిజినెస్. అదేంటీ వీళ్లు చావుతో కూడా బిజినెస్ చేస్తున్నారా? అనే డౌట్ రావొచ్చు. ఒకరకంగా బిజినెస్సే కానీ.., ఇలా డెడ్ బాడీ మోస్తూ డ్యాన్స్ చేసే సాంప్రదాయం మాత్రం విషాదం దాగి ఉంది. ఓ స్కూల్ విద్యార్ధికి తినడానికి తిండిలేక, కట్టేందుకు స్కూల్ ఫీజ్ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వచ్చింది ఈ మెరుపులాంటి ఐడియా. అంతే ఆ విద్యార్ధే ఈ సాంప్రదాయానికి ప్రాణం పోశాడు. ఇంతకీ ఆ విద్యార్ధి ఎవరూ? అంతిమ యాత్రలో ఇలా డ్యాన్స్ చేసేందుకు బాధిత కుటుంబాలు అందుకు అంగీకరిస్తాయా’ అనే ఆసక్తిర విషయాల గురించి తెలుసుకుందాం.

ఆకలి కేకల నుంచి పుట్టిందే ఈ డ్యాన్స్

వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ కు చెందిన దేశాలలో ఓ దేశం ‘ఘనా'(Ghana). ఆ దేశానికి చెందిన ఓ ప్రాంతంలో నివసించే ‘బెంజిమన్’ అనే వ్యక్తి స్కూల్‌కు వెళ్లే సమయంలో తినడానికి పస్తులుండేవాడు. ఏం చేయాలో పాలు పోక ఈ ఆకలి కేకల నుంచి బయటపడాలంటే ఏదోఒకటి చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడి డెడ్ బాడీలను మోసే పని ప్రారంభించాడు. అలా మొదలైన ఈ అంతిమయాత్ర రోజులు గడిచే కొద్ది ఘనా దేశంలో ట్రెడీషన్ గా మారింది. ప్రపంచ దేశాల్లో ట్రెండ్ సెట్టర్ అయ్యింది.

చావుకూడా పెళ్లి లాంటిదే బ్రదర్

2003లో బెంజిమన్ తొలిసారి సంస్థను ప్రారంభించాడు. ఎవరైనా బాధిత కుటుంబాల సభ్యులు.. ఆ సంస్థకు కాల్ చేసి సర్వీస్ కావాలంటే వెళ్లి నార్మల్ గా అంతిమయాత్ర చేసి వచ్చేవారు. అయితే 2004లో బెంజిమన్ కు కమల్హాసన్ ఆకలిరాజ్యం సినిమాలోని ‘చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్’ అనే పాట తరహాలో మనిషి చనిపోయిన తరువాత జరిపించే అంత్యక్రియల్ని నవ్వుతూ, డ్యాన్స్ వేస్తూ ఎందుకు చేయకూడదనే ఐడియా వచ్చింది. ఈ ఐడియా బాగుంది కానీ డెడ్బాడీ మోస్తూ డ్యాన్స్ వేస్తే కష్టమర్లు యాక్సప్ట్ చేస్తారా అనే డౌట్ వచ్చింది. ఆ డౌట్ తోనే ఓ సారి తన వద్దకు వచ్చిన కష్టమర్ కు భయంభయంగానే ఈ కొత్త సర్వీస్ గురించి చెప్పాడు. ఈ కొత్త సర్వీస్ తనకు బాగుందని, తనకు ఇలాగే కావాలని చెప్పడంతో ఆ ఐడియానే ఇంప్లిమెంట్ చేశాడు యజమాని బెంజిమన్.

కరోనాతో వెలుగులోకి

2003 లో ప్రారంభమైన గతేడాది కరోనా వ్యాప్తితో కొఫిన్ డ్యాన్స్ పాపులర్ అయ్యింది. 2017లో ఈ కొఫిన్ డ్యాన్స్ గురించి నేషనల్ మీడియాలో కథనాల్ని ప్రచారం చేసింది. కానీ అప్పుడు అంత స్పందన రాలేదు. కానీ గతేడాది కరోనాతో మీమర్స్ క్రియేటివిటీతో సూపర్ హిట్ అయ్యింది. ఏదైనా పని ఫెయిల్ అయ్యిందంటే మీమర్స్ ఈ శవపేటిక డ్యాన్స్‌తో ఫన్ క్రియేట్ చేసేవారు.

Advertisement

Next Story

Most Viewed