భద్రాద్రి ఆలయం అరుదైన ఫోటో

by Shyam |
భద్రాద్రి ఆలయం అరుదైన ఫోటో
X

దిశ, హైదరాబాద్: ఈ రోజు (గురువారం) శ్రీరామ నవమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలా ‘శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాము రారండి’ అంటూ వినిపించే పాటను ప్రతి ఒక్కరూ చెవులారా.. ఆలకిస్తారు. ఇక భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉన్నందున.. సీతారాముల కల్యాణాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈ నేపథ్యంలో 300 సంవత్సరాల కిందట భద్రాద్రిలో రాములోరికి హైదరాబాద్ నిజాం స్టేట్ సీనియర్ అధికారులు బహుమతులను అందజేస్తున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఈ ఫోటో 1890 ప్రాంతం నాటిదిగా భావిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇతర సంప్రదాయ బహుమతులను రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తోంది.

Tags : Bhadrachalam, Sri Rama Temple, Nizam state, special pic

Advertisement

Next Story

Most Viewed