- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ మృతదేహాలకు కొత్త యంత్రం.. అరగంటకు ఒక దహనం
దిశ, ఆదిలాబాద్: కొవిడ్ మృతదేహాల అంత్యక్రియల కోసం మున్సిపల్శాఖ ప్రత్యేక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రూరల్ మండలంలోని మావల శివారులోగల స్మశానవాటికలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్ వైరస్‌తో మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వాళ్లు కూడా అంత్యక్రియలకు ముందుకు రావడం లేదు. ఓ పక్క గ్రామాల్లోకి రానివ్వకపోవడం.. మరోపక్క దహనసంస్కారాలకు కట్టెలు కొరత ఏర్పడింది. దీంతో మున్సిపల్ శాఖ పట్టణ ప్రణాళిక నిధులతో 12 లక్షల రూపాయలను వెచ్చించి ప్రత్యేక యంత్రాన్ని కొనుగోలు చేసింది. రూరల్ మండలంలోని మావల శివారులో గల కొవిడ్ స్మశానవాటికలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎల్పీజీ గ్యాస్ తో పనిచేసే ఈ యంత్రం అరగంటకు ఒక మృతదేహాన్ని దహనం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే పనులు పూర్తి కాగా.. ఇటీవల మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ యంత్రాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.