గర్భిణులు, బాలింతలకు స్పెషల్ ఫుడ్

by Sridhar Babu |
గర్భిణులు, బాలింతలకు స్పెషల్ ఫుడ్
X

దిశ, కరీంనగర్: మారుమూల గ్రామాల నుంచి చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చే వ్యాధిగ్రస్తులు సరైన ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. అందులో గర్భిణులు, బాలింతలు అయితే మరింత సఫర్ అవుతారు. పౌష్టికాహారం అయితే అస్సలే లభించదు. ఈ నేపథ్యంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలల్లో గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మీదట చెకప్, వ్యాక్సినేషన్ కోసం పీహెచ్‌సీలకు వచ్చేవారికి టమాట కర్రీ, ఎగ్‌తో పాటు భోజనం అందించనున్నారు. దీనికి సంబంధించిన తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story