నర్సులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి

by Shyam |
నర్సులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి
X

దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్ -19 వైద్య సేవలకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతిచ్చిన నేపథ్యంలో బాధితులకు సేవలు అందించే నర్సులకు పూర్తి స్థాయి రక్షణ చర్యలు అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూడావత్ లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలో నర్సింగ్ అసోసియేషన్‌కు ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నర్సుల రక్షణకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్‌లను అందించాలన్నారు. కరోనా వార్డుల్లో పనిచేసే సిబ్బందికి ఆయా ఆస్పత్రి యాజమాన్యాలే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. సరైన పోషకాహారం, ప్రత్యేక బాత్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలను కూడా కల్పించాలన్నారు. కరోన వార్డుల్లో పనిచేసే నర్సులు, సిబ్బంది కరోన బారిన పడితే, వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలను యాజమాన్యాలే కల్పించాలన్నారు. అలాగే నర్సులకు పూర్తి స్థాయి వేతనంతో పాటు కరోనా అలవెన్సును అందజేయాలన్నారు.

Advertisement

Next Story