- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు..
దిశ, ఏపీ బ్యూరో: నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బుధవారం జరిగిన ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి అద్భుతమైన పథకమని కొనియాడారు. ఏడాదికి రూ.15వేలు చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు.
వైఎస్ఆర్ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని.. అలాగే 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూతతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు.