కోవిడ్ -19 మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక కమిటీ

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో:
కోవిడ్ -19 అనుమానితులు, పాజిటివ్ కేసుల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల ప్ర్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కరోనాతో మరణించిన వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఉండటంతో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించి, గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పనిచేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్.రవికుమార్ (9154114996) చైర్ పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అన్ని శాఖల అధికారులు కలిసి ఎనిమిది మంది ఉంటారు. పోలీస్, కలెక్టరేట్, హెల్త్, ఫోరెన్సిక్ నిపుణులు ఉంటారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కోవిడ్ 19 సంబంధ మరణాలు సంభవించినపుడు అంత్యక్రియల్లో తీసుకోవాల్సిన జాగ్రతలు, చర్యలపై ఈ కమిటీ పనిచేస్తుంది. కేంద్రప్రభుత్వం ‘కోవిడ్ -19 మరణాల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు విడుదల చేసిన నియామావళిని’ పాటించేలా కమిటీ బాధ్యత వహిస్తుంది.

Tags: Covid-19, Positive cases, deaths, central govt, committee

Advertisement

Next Story

Most Viewed