- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలువలో చెత్త..గరమైన స్పీకర్ పోచారం
దిశ, నిజామాబాద్ :
బాన్సువాడ నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని దుకాణాలు, హోటల్ యజమానులు ఎక్కడి చెత్త అక్కడ పడవేయటంపై ప్రశ్నలు గుప్పించారు. శనివారం బాన్సువాడ ప్రధాన రహదారి గుండా వెళ్తున్న స్పీకర్ స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద ఉన్న చెత్త, చెదారాన్ని చూసి వాహనం ఆపారు. రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో షాపులు, హోటల్ వ్యాపారులు చెత్తను వేయడం చూసి వారిపై మండిపడ్డారు. చెత్తను మురుగు కాల్వలలో వేస్తే నీరు నిలువ ఉండి దోమల వ్యాప్తి జరుగుతుందని, తద్వారా కొత్త వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. పట్టణ పురపాలక సంఘం ప్రత్యేక వాహనాల్లో చెత్తను సేకరిస్తున్నదని, వ్యాపారులు రోడ్ల మీద, డ్రైనేజీలలో వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు.ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఆయా వ్యక్తులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసన సభాపతి అధికారులను ఆదేశించారు.