నక్సల్స్ పై నిఘా వేయండి: ఎస్పీ శశిధర్ రాజు

by Aamani |   ( Updated:2020-04-13 08:51:38.0  )
నక్సల్స్ పై నిఘా వేయండి: ఎస్పీ శశిధర్ రాజు
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో నక్సల్స్ కదలికలపై నిఘా వేసి ఉంచాలని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం వారికి స్పెషల్ పార్టీ కిట్ బ్యాగ్స్, జంగిల్ షూ, జంగిల్ ప్యాచ్ డ్రస్ తదితర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలో ఉన్నందున వారిని తరిమికొట్టేందుకు అందరూ మ్యాపింగ్, కంపాస్, ఫైరింగ్‌లలో మంచి నైపుణ్యత కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహణతోపాటు ఆరోగ్యం ముఖ్యమని దాని కోసం ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని ఎస్పీ శశిధర్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస రావు, వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.

tag: SP Shashidhar Raju, comments, meeting, special party, nirmal

Advertisement

Next Story