వలస కార్మికులను త్వరగా స్వస్థలాలకు పంపాలి: ఎస్పీ రంగనాథ్

by Shyam |
వలస కార్మికులను త్వరగా స్వస్థలాలకు పంపాలి: ఎస్పీ రంగనాథ్
X

దిశ, నల్లగొండ: వీలైనంత త్వరగా వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. వలస కార్మికుల సమస్యలపై దామరచర్ల పవర్ ప్లాంట్ అధికారులు, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువ భాగం జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల వాళ్లు ఎక్కవగా ఉన్నారని తెలిపారు. వీరందరిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో కార్మికులకు ఇవ్వాల్సిన ఒక నెల వేతనంపై ఉన్నతాధికారులతో సంప్రదించి చెల్లించేలా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వలస కార్మికులు, కూలీలను తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని సూచించారు. పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, రూరల్ సీఐ రమేశ్‌బాబు, పవర్ ప్లాంట్ అధికారులు పాల్గొన్నారు.

Tags: Nalgonda,Sp Ranganath, Review, Migrant workers

Advertisement

Next Story

Most Viewed