- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9.5 శాతానికి వృద్ధి అంచనాను తగ్గించిన ఎస్అండ్‌పీ..
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో లాక్‌డౌన్ ఆంక్షల వల్ల కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతం శాతానికి తగ్గిస్తున్నట్టు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్‌పీ గురువారం వెల్లడించింది. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లపాటు వృద్ధికి విఘాతం ఉంటుందని, 2023, మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 7.8 శాతంగా అంచనా వేస్తున్నట్టు ఎస్అండ్‌పీ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం జనాభాలో 15 శాతం మందికి మాత్రమే టీకా పంపిణీ జరిగింది. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్న కారణంగా టీకా ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్టు ఎస్అండ్‌పీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రెండంకెలలోపే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. కాగా, దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు ఏజెన్సీలు వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఆర్‌బీఐ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 9.5 శాతానికి తగ్గించింది.