కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే: ఎస్పీ చేతన

by Shyam |
కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే: ఎస్పీ చేతన
X

దిశ, మహబూబ్‌నగర్: వాట్సాప్ గ్రూపుల్లో కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన హెచ్చరించారు. గ్రూపులో ఎవరు తప్పు చేసినా బాధ్యత అడ్మిన్‌దే అని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్న వారిని వదిలేది లేదని, ముఖ్యంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కరోనా వ్యాధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. కానీ, కొందరు ఆకతాయిలు వార్తా ఛానల్ బ్రేకింగ్ పేరుతో, కంప్యూటర్లలో గ్రాఫిక్స్ తయారుచేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని ఎస్పీ మండిపడ్డారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన తెలిపారు.

Tags: SP chetana, comments, fake news, coronavirus, narayanpet

Advertisement

Next Story

Most Viewed